AP Elections 2024 : కళ్యాణదుర్గంలో టెన్షన్ టెన్షన్.. అమ్మకానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు? పోస్టల బ్యాలెట్ ఓట్లను అమ్ముకుంటున్నారంటూ కల్యాణదుర్గంలో టీడీపీ నేతల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరే ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. By Nikhil 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం(Kalyandurg) లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ సెంటర్(Postal Ballet Center) దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొంటున్నారని ఆరోపణలు రావడమే ఈ ఉద్రిక్తతకు కారణమైంది. ఉద్యోగులకు డబ్బులు ఇస్తుండగా టీడీపీ(TDP) నేతలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆర్డీవో ఆఫీస్ దగ్గరే వైసీపీ(YCP) నేతలు దందాకు లేపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ(Andhra Pradesh) లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోస్టల్ బ్యాలెట్ కేంద్రల వద్ద ప్రభుత్వ ఉద్యోగులు క్యూలు కట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఓటు వేసేందుకు ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్దు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో మరో రెండురోజులపాటు సాగనున్న ఓటింగ్ కొనసాగనుంది. Also Read : పాణ్యంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం- LIVE #ap-ycp #ap-tdp #postal-ballet-issue #kalyandurg మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి