Pawan Kalyan: నా నాలుగో పెళ్ళాం నువ్వే.. సీఎం జగన్‌పై పవన్ పంచులు

సీఎం జగన్ నాలుగు పెళ్లిళ్లు అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. పవన్ అంటే ముగ్గురు పెళ్ళాలు, రెండు విడాకులు అంటారని, ఆయన దృష్టిలో నాకు నాలుగో పెళ్లాం కూడా ఉందని, అది బహుషా జగనే అయి ఉంటారని ఎద్దేవా చేశాడు.

New Update
Pawan Kalyan: నా నాలుగో పెళ్ళాం నువ్వే.. సీఎం జగన్‌పై పవన్ పంచులు

Pawan Kalyan: సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల పై వైసీపీ నేతలు చేస్తున్న దాడికి కౌంటర్ ఇచ్చారు. తనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి వాస్తవమే.. అందులో రెండు విడాకులు అయ్యాయి. అయితే.. జగన్ మాత్రం తనకు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని పరచటం చేస్తున్నారని అన్నారు. తనకు నాలుగో పెళ్ళాం ఎవరో అర్థం కావడం లేదని.. బహుశా తన నాలుగో పెళ్ళాం సీఎం జగనే కావచ్చు అంటూ చురకలు అంటించారు.

జగన్ కు యుద్ధం చూపిస్తా..

సిద్ధం సిద్ధం అని చవగోడుతున్న జగన్ కు ఎన్నికల్లో యుద్ధం చూపిస్తాం అని అన్నారు పవన్. OG సినిమా డబ్బులు కేజీ బియ్యం కొనకుండా హెలికాఫ్టర్లకు పెడుతున్న అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లు మీద ప్రయాణం చాలా సాఫీగా జరుగుతుందని ఎద్దెబా చేశారు. వైసిపి గుండాయిజం చూసి ఎవరూ భయపడోద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019లో జగన్ కు ఓటు వెయ్యద్దని రాష్ట్ర ప్రజలను కోరినట్లు తెలిపారు.

జగన్...నీ వ్యక్తిగత జీవితం గురించి..

జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే టన్నులు టన్నులు విషయం ఉందని అన్నారు పవన్. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఏం చేసేవాడివో తనకు తెలీదని అనుకుంటున్నావా? అని నిలదీశారు. గోబెల్స్ ప్రచారాలు చేస్తే గోబెల్స్ కు పట్టిన గతే నీకు పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. నీ తాత సొమ్మా ప్రజలకు ఇచ్చేది.... వాళ్ళు కట్టే పన్నులేగా అని ప్రశ్నించారు. తనకు కోట్లు సంపాదించే స్కిల్ ఉందని.. ప్రజలు కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

24 స్థానాలు అందుకే..

టీడీపీతో పొత్తులో భాగంగా 24 స్థానాలు తీసుకున్నానని అన్నారు పవన్. ఇంతేనా ఇంతేనా అంటున్నారని... బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నాడని సామెత చెప్పారు. జనసేన వామనావతారం చూపిస్తుందని పేర్కొన్నారు. జగన్ నీ ఓటమి చూడకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ ఏ కాదు అని సవాల్ విసిరారు. గాయత్రి మంత్రం 24 అక్షరాలని అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేయటానికి కోట్లాది రూపాయిలున్నాయా మన దగ్గర అని జనసైనికులను ప్రశ్నించారు. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు