Pawan Yatra: దూకుడు పెంచిన జనసేనాని.. వారాహి యాత్ర షెడ్యూల్ ఇదే! జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఆయన ఇక్కడ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 12వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Trinath 29 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Janasena Varahi Yatra Schedule: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ ప్రచారంలో దూకుడు కనబరుస్తుండగా.. తాజాగా పవన్ తన ప్రచార షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి (Varahi Yatra) షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల పర్యటనలో పవన్ ఇకపై బిజీగా ఉండనున్నారు. మొదట విడతగా తాను పోటీ చేసే నియోజకవర్గoతో పాటు 10 నియోజకవర్గాలలో పవన్ పర్యటించనున్నారు. ఈనెల 30 (రేపు)నుంచి ఏప్రిల్ 12 వరకు వారాహి యాత్ర సాగనుంది. రేపు పిఠాపురంలో వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. పవన్ (Pawan Kalyan) ఇక్కడ నుంచే పోటికి దిగనున్న విషయం తెలిసిందే. పవన్ వారాహి యాత్ర హెడ్యూల్: --> మార్చి 30- పిఠాపురం --> ఏప్రిల్ 3న తెనాలిలో --> ఏప్రిల్ 4 నెల్లిమర్ల --> ఏప్రిల్ 5 అనకాపల్లి --> ఏప్రిల్ 6 ఎలమంచిలి --> ఏప్రిల్ 7 పెందుర్తి --> ఏప్రిల్ 8 కాకినాడ రూరల్ --> ఏప్రిల్ 9 పిఠాపురం --> ఏప్రిల్ 10 రాజోలు --> ఏప్రిల్ 11 పి గన్నవరం --> ఏప్రిల్ 12 రాజానగరం "వారాహి విజయభేరి" • మార్చి 30న పిఠాపురంలో బహిరంగ సభతో ప్రారంభం. 📍చేబ్రోలు రామాలయం సెంటర్, సాయంత్రం 4:00 గంటలకు..#VarahiVijayaBheri pic.twitter.com/TQZM8T8QjR — JanaSena Party (@JanaSenaParty) March 28, 2024 ముందుగా పవన్ పోటీ చేసే నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు సమావేశాలు ఒక బహిరంగ సభ ఉండనుంది. పవన్ వారాహి పర్యటనలో నియోజకవర్గ మండలం బూత్ స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. పొత్తు పార్టీల నాయకులు, వీర మహిళలతో కూడా పవన్ మీటింగ్ పెడతారు పవన్ వారాహి యాత్రతో కేడర్‌తో జోష్ నెలకొంది. Also Read: ప్రజలకు ప్రశ్నించే గొంతుకనవుతా..టికెట్ ఇవ్వకున్నా ప్రశ్నిస్తూనే ఉంటా..! #pawn-kalyan #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి