వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి , కర్నూలు నగరాలకు ఏకంగా 42 ప్రత్యేక వారపు రైళ్లను నడపడానికి సిద్ధమైంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో.. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి.
Also Read: Bharat: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
విశాఖపట్నం-బెంగళూరు మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం విశాఖ నుండి బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సోమవారం బెంగళూరు నుండి విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పేట్, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
Also Read: China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!
విశాఖపట్నం-తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి బుధవారం విశాఖ నుండి బయలుదేరుతుంది.. తిరుగు ప్రయాణంలో గురువారం తిరుపతి నుండి విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్‌లు ఉంటాయని అధికారులు వివరించారు.
విశాఖపట్నం-కర్నూలు సిటీ మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం విశాఖ నుండి మొదలవుతుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం కర్నూలు సిటీ నుండి విశాఖ చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో స్టాప్ ఉంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ రైళ్ల బయలుదేరే సమయాల గురించిన వివరాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు.
దీంతో పాటు.. హైదరాబాద్ నగరం నుండి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను నడపడం జరుగుతోందని అధికారులు తెలిపారు.
Also Read:Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
Also Read:AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
vizag | tirupati | kurnool | special-trains | summer | summer-special-trains | summer-special | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates