Chandrababu: వంద కాదు వేయి శాతం గెలుస్తాం.. చంద్రబాబు సంచలన ఇంటర్వ్యూ

ఏపీలో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వంద శాతం కాదు.. వేయి శాతం తాము గెలుస్తామన్నారు. జగన్ ఓ సైకో, శాడిస్ట్, విధ్వంసకుడని.. ఆయనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. చంద్రబాబు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

New Update
Chandrababu : కేంద్రంలో చక్రం తిప్పేది చంద్రబాబే.. తేడా వస్తే ఎన్డీయేకు ఇబ్బందే!

ఏపీలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో తాను వంద కాదు వేయి శాతం గెలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఈ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను విధ్వంసం చేశాడన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడని ధ్వజమెత్తాడు. ప్రముఖ వార్త సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ఇలాంటి వ్యక్తిని కూడా చూడలేదన్నారు. జగన్ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ క్లీయర్ స్వీప్ చేయబోతోందన్నారు. జగన్ ఓ సైకో, శాడిస్ట్, విధ్వంసకుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ప్రజావేధికను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింనద్నారు. గతంలో హైదరాబాద్ లో తాను నిర్మించిన హైటెక్ సిటీని తర్వాత సీఎం అయిన రాజశేఖర్ రెడ్డి ధ్వంసం చేయలేదన్నారు. తాను చేపట్టిన రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ ను కొనసాగించాడని గుర్తు చేశారు.

జగన్ చేసిన ధ్వంసం కారణంగా పదేళ్ల తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. ప్రజలు పాలించమని ఐదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశాడని ప్రశ్నించారు. ఇన్ని రోజులే ఏం చేయకుండా.. ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మాట్లాడడం ఏంటని ఫైర్ అయ్యారు. కేంద్రం ఆమోదించిన అమరావతి రాజధాని ఉండగా.. కాదని దానిని ధ్వంసం చేశాడని ప్రశ్నించారు. హైదరాబాద్ ను అంచెలంచెలుగా అభివృద్ధి చేశానన్నారు. ఆ రోజు తాను చేసిన కృషి కారణంగానే ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించే స్థాయికి చేరిందన్నారు.

తాను ఏర్పాటు చేసిన బయోటెక్నాలజీ పార్క్ ను రాజశేఖర్ రెడ్డి నాశనం చేసుంటే.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండేదా? అని ప్రశ్నించారు. తాను రూపొందించిన విధానాన్ని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారన్నారు. తాను రాజశేఖర్ రెడ్డి కన్నా ముందే ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు. జగన్ కు మానసిక సమస్యలు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వారు రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హులు కాదన్నారు.

5 లక్షల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను జగన్ నాశనం చేశాడన్నారు. అనేక పథకాలను తాను ప్రారంభించాన్నారు. పెన్షన్ ను రూ.వేయి నుంచి రూ.2 వేలకు పెంచింది తానేనన్నారు. అన్నా పెన్షన్లు, చంద్రన్న భీమా.. తదితర పథకాలు తాను ప్రారంభించింది తానేనని గుర్తు చేశారు. తాను ఎలాంటి పథకాలు ప్రారంభించలేదని జగన్ అబద్ధాలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు