Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై?

తాను సీఎం జగన్‌పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై?

MLA Balineni Srinivasa Reddy: నేతల రాజీనామాలు చేరికలతో ఏపీ రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా ఒంగోలు (Ongole) వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో (TDP) చేరుతారనే ప్రచారం జోరందుకుంది. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ మంత్రి బాలినేని. వైసీపీ విడడంపై క్లారిటీ ఇచ్చారు.

సీఎం జగన్ అలిగిన..

కొంతమంది తాను సీఎం జగన్ పై (CM Jagan) అలిగాను అని ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి బాలినేని. తాను ప్రజల కోసం ప్రశ్నించే మనిషినని పదవుల కోసం ఎదురుచూసే మనిషిని కాదని పేర్కొన్నారు. ఉన్న విషయం ఉన్నట్టుగా చెపుతా అని అన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పని చేసినట్లు తెలిపారు. అవసరం అయితే రాజకియాలు మానుకొంటాను కాని ప్రశ్నించడం మానుకోను అని తేల్చి చెప్పారు.

ALSO READ: మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా?

డబ్బులు లేక..

పీఆర్‌సీ ఇంకా అమలు తమ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చారు మంత్రి బాలినేని. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకనే పీఆర్‌సీని సీఎం జగన్ ఇవ్వలేదని ఇవ్వలేదని.. త్వరలోనే వస్తాయని భరోసాను ఇచ్చారు. ప్రజల సమస్యలను తీర్చేందుకే నిధులు సమీకరించాడని సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు అన్నారు.

టీడీపీలో చేరుతానా?..

సీఎం జగన్ పై మాగుంట శ్రీనివాస్ రెడ్ది కోసం పోరాడినట్లు తెలిపారు. ఆయనతో పాటు టీడీపీలోకి పోవాలనుకోలేదని తేల్చి చెప్పారు. చిత్త శుద్దితో ఉంటే ఎవరు ఏమి మాట్లాడినా లెక్కచెయ్యక్కర్లేదని హితవు పలికారు. పార్టీ లో ఉండి ద్రోహం చేసే వ్యక్తి ని తాను కాదని అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు చెప్పిన మాటలే తనకు ఆదర్శం అన్నారు. సీఎం జగన్ కోసం పనిచేస్తానని..టీడీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు