AP Crime News: ఏపీలో మరో దారుణం.. పదేళ్ల చిన్నారి కిడ్నాప్ మర్డర్.. అసలేమైందంటే?

వివాహేతర సంబంధంతో 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లో మానస ఐదోవ తరగతి చదువుతోంది. తల్లితో అక్రమ సంబంధం కారణంగానే మానస మృతికి కారణంగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.

New Update
AP Crime News: ఏపీలో మరో దారుణం.. పదేళ్ల చిన్నారి కిడ్నాప్ మర్డర్.. అసలేమైందంటే?

కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఓ దుండగుడు. స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లో మానస ఐదోవ తరగతి చదువుతోంది. ఈ నెల 20వ తేదీన స్కూల్ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి బయటకు వెళ్లింది మానస. ఎంత సేపైనా మానస తిరిగి రాకపోవడంతో తల్లికి ఫోన్ చేసి ఉపాధ్యాయులు చెప్పారు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి జ్యోతి. కట్టమూరు సమీప పామాయిల్ తోటలో ఆరు రోజుల తరువాత కుళ్ళిన స్థితిలో మృతదేహన్ని స్ధానికులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, వస్తువుల ఆధారంగా అది మానస మృతదేహమేనని తల్లి జ్యోతి గుర్తించింది. తల్లి జ్యోతితో అక్రమ సంబంధం కారణంగానే మానస మృతికి కారణంగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపేట మండలం వడిసలేరుకు చెందిన బాలిక తల్లి జ్యోతి సమీప బంధువు నానిబాబు అనే వ్యక్తి బైక్‌పై తీసుకుని వెళ్ళాడాన్ని పోలీసులు గుర్తించారు. 3 సంత్సవరాలుగా తల్లి జ్యోతి భర్తను విడిచిపెట్టి మేనత్త కొడుకైన నానిబాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జ్యోతి- నానిబాబును కొన్ని రోజులుగా దూరం పెట్టడంతో పక్కా ప్లాన్‌తో నానిబాబు మానసను కిడ్నాప్ చేసిన కొద్ది నిమిషాల్లోనే హత్య చేశాడు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడు నానిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ప్రకటించారు పోలీసులు.

కఠినంగా శిక్షించాలని డిమాండ్

ఆరు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. చిన్నారి మానస మృతికి కారణమైన నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, పాఠశాల దగ్గర సరైన రక్షణ లేదంటూ ఆందోళన చేపట్టిన పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీవాసులు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లో మానస ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజాసంఘాలు, సేవాసంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్‌తో నిరసన తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు పెట్టినా.. చిన్న పిల్లలపైనా.. మహిళలుపై అగాత్యాలు ఆగడం లేదంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు మానసను దారుణ హత్య చేసిన నిందితుడైన నాని బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని సోమవారం పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహిళలు గుర్రాల సెంటర్‌లో ధర్నా చేశారు. పాపా మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య

విశాఖపట్నం దువ్వాడలోని రాజీవ్ నగర్‌లో రిటైర్డ్ డాక్‌యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. భార్యాభర్తలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

New Update
vishaka crime news

vishaka crime news

AP Crime: విశాఖపట్నం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్ డాక్‌యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు మరియు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గురువారం రాత్రి 8 నుంచి 9:30 ఘటల మధ్య ఈ దారుణం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భార్యాభర్తలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. దుండగులు ముందుగానే పక్కా పథకం వేసుకొని వచ్చి, లక్ష్మిని బెడ్‌రూమ్‌లో గొంతు కోసి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా దోచుకుపోయారు.

ఇద్దరి శవాలు రక్తపు మడుగులో..

ఈ సమయంలో భర్త యోగేంద్రబాబు ఇంట్లో ఉండగా, భార్యపై దాడి జరుగుతున్నదాన్ని చూశాడు. ఆమెను రక్షించబోయే ప్రయత్నంలో అతనిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేశారు. యోగేంద్ర శరీరంపై 8 కత్తిపోట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అరవులు వినిపించాయని కొంతమంది స్థానికులు చెప్పినప్పటికీ.. అదేదో కుటుంబ కలహమేనేమో అనుకుని పట్టించుకోలేదని చెబుతున్నారు. దంపతులు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. శుక్రవారం సాయంత్రం మేనల్లుడు ఇంటికి వచ్చి తలుపులు తాళం వేసి ఉండటాన్ని గమనించి, స్థానికులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా, ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

ఇది కూడా చదవండి: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి

దుండగులు హత్య అనంతరం ఇంటికి తాళం వేసి, అక్కడి నుంచి యోగేంద్ర బాబుకి చెందిన స్కూటీపై పరారయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూటీ మాయం కావడంతోనే ఈ కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు తెచ్చుకున్న కత్తులను కూడా వెంట తీసుకెళ్లడం ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన వెనుక ఖచ్చితంగా ఆస్తి, నగల కోసం జరిగిన దోపిడీ ఉద్దేశమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో ఏనుగుల భీభత్సం.. రైతును తొక్కి చంపిన గజరాజులు

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment