CM Jagan: ఈ విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సీఎం సూచన భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. By E. Chinni 31 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి ap cm ys jagan reddy review on jagananna saswatha bhu hakku bhu raksha: భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు: చాలా రాష్ట్రాల్లో మండలానికి ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉన్నారని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలోకూడా సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోందన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నామన్నారు. అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. కోర్టు అనుమతితో ఖరారైన సీఎం జగన్ విదేశీ పర్యటన: కాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా వీరిద్దరి పాస్ పోర్టులు కోర్టు ఆధీనంలో ఉంటాయి. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం జగన్, ఎంపీ విజయసాయి కోర్టు అనుమతి తీసుకున్నారు. సీఎం జగన్ యూకేకు వ్యక్తిగత పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు యూకేలో పర్యటించనున్నారు. యూకేలో సీఎం కుమార్తెలు చదువుకుంటున్నారు. వారిని కలిసేందుకు సీఎం జగన్.. కోర్టుకు దరఖాస్తు చేసుకుని అనుమతి కోరారు. అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి వచ్చే రు నెలల కాలంలో నెల రోజుల పాటు విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయి కి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది: అయితే వీరిద్దరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టులో వాదించింది. జగన్, విజయ సాయి దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని, సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ కోర్టు వివరించారు. అయతే వీరి వాదనను తోసి పుచ్చిన కోర్టు.. జగన్, విజయసాయి రెడ్డిలకు అనుకూలమైన తీర్పును ఇచ్చింది. ఇవి కూడా చదవండి: మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!! Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!! చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..! #andhra-pradesh #cm-jagan #ap-cm-jagan #political-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి