EC Notices: సీఎం జగన్‌కు ఈసీ షాక్! ఏపీ సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది ఈసీ. ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఈసీ పేర్కొంది. By Nikhil 07 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి EC Notices to YS Jagan: ఏపీ సీఎం జగన్‌కు (AP CM Jagan) భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి (Election Commission of India) ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈసీ. ఇది కూడా చదవండి: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో జగన్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు అలవాటు చేసుకున్నారంటూ విమర్శలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చసశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా జగన్ కు నోటీసులు జారీ చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ పై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న వైసీపీ నేతల ఫిర్యాదుకు స్పందించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది ఈసీ. #ap-elections-2024 #ec #cm-ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి