Amaravati: ఏపీకి శాపంగా జగన్.. అమరావతిని ఎలా నాశనం చేశాడంటే: చంద్రబాబు-LIVE అవరావతిని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నాశనం చేశాడని సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఏపీకి జగన్ శాపంగా మారాడన్నారు. ప్రజావేదిక కూలగొట్టడంతో అమరావతిలో విధ్వంసం ప్రారంభించాడన్నారు. అమరావతిపై చంద్రబాబు ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేశారు. By Nikhil 03 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి అన్ని ప్రాంతాలకు సమదూరంలో అమరావతి ఉంటుందని చంద్రబాబు అన్నారు. అందుకే అక్కడ రాజధానిని నిర్మించాలని నిర్ణయించామన్నారు. ప్రతీ ఒక్కరూ అంగీకరించే నిర్ణయం ఇది అన్నారు. పవిత్ర లక్ష్యంతో అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు. అమరావతి పేరును నాడు కేబినెట్ లో వందశాతం అంగీకరించారన్నారు. అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతిలో ఉంచామని గుర్తు చేశారు. దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి పవిత్ర నీరు, మట్టి తీసుకువచ్చామన్నారు. పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉందన్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకువచ్చారన్నారు. అందరికీ న్యాయం జరగాలన్న లక్ష్యంతో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేశామన్నారు. గొడవ అనేది లేకుండా భూసేకరణ చేశామన్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ చేసినట్లు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున భూములివ్వడం చరిత్రలో లేదన్నారు. 29వేల మందికి పైగా రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారన్నారు. భూములిచ్చిన రైతులకు మెరుగైన పరిహారం ఇచ్చామన్నారు. రైతులకు కేంద్రం క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ ఇచ్చిందన్నారు. అమరావతిలో తన కంటే ముందు జగన్ ఇల్లు కట్టారన్నారు చంద్రబాబు. రాజధాని కోసం సింగపూర్‌తో ఎంవోయూ చేసుకున్నామన్నారు. సింగపూర్ ప్రభుత్వం అమరావతి కోసం ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతి ఉండాలి అనుకున్నామన్నారు. అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్స్ అన్నీ ఒకే చోట నిర్మించాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు గతంలో సైబరాబాద్ నిర్మాణంలో చరిత్రను తిరగరాసిన చరిత్ర తమదన్నారు. ప్రజావేదిక కూలగొట్టడంతో అమరావతిలో విధ్వంసం ప్రారంభమైందన్నారు. జవాబుదారీతనం లేకుండా పాలన చేశారన్నారు. విధ్వంసానికి ఏం చేయాలో అన్నీ చేశారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 1631 రోజులు రైతులు అమరావతి ఉద్యమం చేశారన్నారు. ఉద్యమం చేసిన రైతుల త్యాగం ఊరికే పోదన్నారు. రైతులకు ఏటా ఇవ్వాల్సిన పరిహారం, పెన్షన్లు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను తొలగించారన్నారు. జగన్ ఏపీకి శాపంగా మారాడన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి