/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cbn-3.jpg)
CM Chandrababu Naidu: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రజలకు చేరువ అయ్యేందుకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ప్రజలకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సచివాలయంలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.
తమకు సాయం కావాలని వచ్చిన వారిని అందర్ని కూడా బాబు స్వయంగా కలుస్తున్నారు. వారి సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం సెక్రటేరియట్ నుంచి వెళ్తూ..సచివాలయం బయట ఉన్న సందర్శకులను చూసి ఆయన కాన్వాయ్ ను ఆపారు.
సెక్రటేరియట్ నుంచి వెళ్తూ, సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపి, వినతిపత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు .@ncbn #chandrababu #Secretariat #leaving #rtvnews #RTV pic.twitter.com/Q5NNO6reJC
— RTV (@RTVnewsnetwork) June 25, 2024
స్వయంగా ఆయనే కారు నుంచి దిగి వారి వద్దకు వచ్చి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.
Also read: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!