Jagan-Chandrababu: జగన్ ను లైట్ తీసుకోండి.. ఎంపీలతో చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు.. మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. ఈ రోజు అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అన్నట్లు తెలుస్తోంది. By Nikhil 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాభివృద్దే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పని చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు.. మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు ఎంపీలతో అన్నట్లు తెలుస్తోంది. అసలు జగన్ ను, వైసీపీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని పలువురు మంత్రులు, ఎంపీలు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఎంపీలు కేంద్రమంత్రులను కలవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సీఎం ఎంపీలకు సూచించారు. ఇంకా.. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు రావాల్సిన నిధులపై సైతం ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: Jagan: వైసీపీని చంద్రబాబు అణగదొక్కలేరు.. జగన్ కీలక వ్యాఖ్యలు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి