AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆ జీవోలు రద్దు!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది మంత్రివర్గం. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీవో నంబర్ 217, 144లను రద్దు చేసింది.

New Update
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆ జీవోలు రద్దు!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది మంత్రివర్గం. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఈ నిబంధనను తప్పిస్తామని గత ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. ఇంకా గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎక్సైజ్ అవకతవకలపై సైతం కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 మధ్య తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీలపై కూడా చర్చించారు.
ఇది కూడా చదవండి: BREAKING: జగన్ భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు

గత ప్రభుత్వం దోపిడీ చేయడం కోసమే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్లు కేబినెట్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు సైతం కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కెబినెట్ సూచించింది. ఇంకా.. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో రద్దు చేసిన కెబినెట్.

మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ కెబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. నాటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇంకా జగన్‌ బొమ్మలతో ఉన్న పాస్‌ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖలు విడుదల చేసిన జీవో నంబర్ 217, 144లను రద్దు చేసింది ఏపీ కేబినెట్.


Advertisment
Advertisment
తాజా కథనాలు