AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే! ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. By Nikhil 16 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కొత్త ఇసుక పాలసీపై ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించనుంది. ఇంకా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పోరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి