Purandeswari: విజయసాయి రెడ్డిపై సుప్రీం చీఫ్ జస్టీస్‌కు లేఖ రాసిన పురందేశ్వరి.. ఏం చెప్పారంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌కు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి సీబీఐ,ఈడీ కేసులకు సంబంధించి షరతులు ఉల్లంఘిస్తున్నారని.. ఆయనపై ఉన్న కేసులన్నీ తక్షణమే విచారించాలని కోరారు. By B Aravind 04 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి విజయసాయి షరతులను ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆయనపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు లేఖతో పాటు ఐదు దస్త్రాలను పురందేశ్వరి జతచేశారు. అలాగే విజయసాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేసి.. వచ్చే ఆరు నెలల్లో ఆయనపై ఉన్న కేసులన్నీ తక్షణమే విచారించాలని లేఖలో అభ్యర్థించారు. Also Read: దీపావళికి ప్రత్యేక రైళ్లు..అనౌన్స్ చేసిన రైల్వే శాఖ! Also Read: ఓట్లకోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్ పై ఏపీ మంత్రి వార్నింగ్..!! ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పదేళ్లకుపైగా బెయిల్‌పై ఉన్నారని.. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా ఆలస్యం చేస్తూ నిరోధిస్తున్నారంటూ తెలిపారు. అలాగే పదే పదే వాయిదాలతో విచారణకు రాకుండా ఉంటున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. #ap-news #ap-politics #purandeswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి