AP: ఫిబ్రవరి 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో మొదులుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, ఈ సమావేశాలను 4 రోజుల నుంచి 5 రోజుల పాటు కొనసాగించాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. By srinivas 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో మొదులుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, ఈ సమావేశాలను 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలని జగన్ సర్కార్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుందని, ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఎలక్షన్ ముందు ఓటాన్ అకౌంట్ పెట్టడం సంప్రదాయంగా కొనసాగుతోంది. హామీలు 99 శాతం అమలు.. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్దులను దాదాపు ఖరారు చేయగా.. త్వరలోనే తుది జాబితాను విడుదల చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామంటున్న జగన్ ఈ ఎన్నికల్లో కొత్త వరాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వ హాయంలో అసెంబ్లీ చివరి సమావేశాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే భీమిలి సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించిన జగన్ వచ్చే నెల 1న ఏలూరు, 3న అనంతపురంలో సిద్దం సభల నిర్వహణకు నిర్ణయించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అసెంబ్లీ నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీని పైన తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్.. అయితే ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండదు. దీంతో 2024 ఏప్రిల్ - జూన్ వరకు మూడు నెలలకు సంబంధించి బడ్జెట్ ను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఫిబ్రవరి1న కేంద్రం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రతిపాదించనుంది. కేంద్రం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ కు తుది రూపు ఇవ్వనుంది. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమవేశం లో ఎన్నికల వరాలకు సంబందించి కీలక నిర్ణయాలు ఉంటాయని అధికార వైసీపీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా రైతులకు రుణమాపీ, ఉద్యోగులకు ఐఆర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంటి అంశాల పైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి : Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సంక్షేమం - సామాజిక న్యాయం.. ఇక ఏపీలో ఉద్యోగాల భర్తీ పై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగబోతుందని ప్రచారం సాగుతోంది. జగన్ తన అయిదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం గురించి చివరి అసెంబ్లీ సమావేశాల్లో వివరించనున్నారు. అదే సమయంలో మరోసారి తాను అధికారంలోకి వస్తే ఏం చేయనుందీ ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల షెడ్యూల్ విడుదల కానుంది. #ap #ap-assembly-sessions #assembly-meetings #febraury మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి