AP Group-1: ఏపీ గ్రూప్-1లో అవకతవకలు? వెలుగులోకి సంచలన విషయాలు!

ఏపీలో 2022 గ్రూప్-1 ర్యాంకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో వెలువడిన కథనాల ఆధారంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు సపోర్టుగా పనిచేసిన అధికారులు, నాయకులతోపాటు జగన్ బంధువులంతా టాపర్లుగా నిలవడం చర్చనీయాంశమైంది.

New Update
AP Group-1: ఏపీ గ్రూప్-1లో అవకతవకలు? వెలుగులోకి  సంచలన విషయాలు!

APPSC: ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ ఎత్తున జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీపీఎస్సీ కమిషన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కొంతమందికి 99శాతానికి పైగా మార్కులు రావడం పలు అనుమాలకు దారితీసింది. ఏపీలో ఒక్కరు కూడా ఇప్పటివరకూ 99శాతానికి పైగా మార్కులు సాధించకపోగా.. ఇంటర్వ్యూలు చేసే బోర్డులు సైతం ఈ స్థాయిలో మార్కులు ఎన్నడూ వేయలేదు. అయితే వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి సంచలనాలు చోటుచేసుకోవడంపై అధికారిక యంత్రాంగంపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

ఆ వర్గం వారంతా టాపర్లే..
ఈ మేరకు 75 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. ఒకరికి 74.5 (99.33) మార్కులు వచ్చాయి. అయితే సదరు అభ్యర్థి గౌతం సవాంగ్‌ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన ఆఫీసులో టెక్నికల్‌ విభాగంలో ఎస్‌ఐగా పనిచేయడం విశేషం. కాగా మరో అభ్యర్థి్కి 74 మార్కులొచ్చాయి. ఆయన మాజీ సీఎం జగన్‌కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్‌రెడ్డి బంధువు కావడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరే కాదు సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్నప్పుడు టాపర్లుగా నిలిచిన 9 మందికి 74 మార్కులు రావడం చర్చ నడుస్తోంది. యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్‌ పరీక్షల తుది ఫలితాల్లోనూ టాపర్‌కు 2,025కి గాను 1,099 మార్కులు వచ్చాయి. ఇక 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200 కావడం విశేషం. అయితే ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇన్ని మార్కులు రావడం మొదటిసారి కావడంతో చాలామంది సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

టాపర్ల మార్కులను వెల్లడించలేదు..
ఇక 2021 జూన్‌లో గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు రద్దుచేసిన వైసీపీ ప్రభుత్వం.. 2022లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చేముందు ఇంటర్వ్యూ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది. అంతేకాదు 2016లో జరిగిన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించిన మార్కులను అప్పటి కమిషన్‌ బహిర్గతం చేయగా.. 2018లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ పోస్టులను భర్తీచేసిన వైసీపీ టాపర్ల మార్కులను వెల్లడించలేదు. గరిష్ఠ మార్కులు సమాచారం కావాలని పలువరు డిమాండ్ చేసినప్పటికీ అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పందించలేదు. కానీ ఫలితాలు ప్రకటించిన రోజున మార్కులు మీడియాకు ఇవ్వాలని సవాంగ్‌ ఆదేశించినప్పటికీ.. అప్పుడు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒప్పుకోకపోవడంతో అంతా ఒకే వర్గానికి చెందిన వారందరినీ జగన్ సర్కార్ పాస్ చేయించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అసలు పోస్టులెన్ని..
ఏపీలో మొత్తం 111 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-1 ఎగ్జామ్ జరిగింది. అయితే 2021లో ఇంటర్వ్యూలను రద్దు చేసిన జగన్‌ సర్కార్.. మెయిన్స్‌ అర్హత సాధించిన వారిని 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పలవడంతో అభ్యర్థులంతా కంగుతిన్నారు. దీనిపై పలువురు ప్రశ్నించగా.. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దాని గురించి తాను ఎలాంటి కామెంట్‌ చేయలేనంటూ సవాంగ్‌ జారుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు