IND vs AUS: వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టులో ఆందోళన వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడింది. మెగా టోర్నీలోకి భారత టీమ్ వెళ్లేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభిమానులు టీమిండియా వరల్డ్ కప్‌లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు. By Karthik 26 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడింది. మెగా టోర్నీలోకి భారత టీమ్ వెళ్లేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభిమానులు టీమిండియా వరల్డ్ కప్‌లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు. కానీ రేపు ఆసిస్‌తో జరిగే మ్యాచ్‌కు పలువుకు క్రికెటర్లు అందుబాటులో ఉండటంలేదని టాక్ వినిపిస్తోంది అక్షర్ పటేల్ గాయం కారణంగా టీమ్ కు దూరం కాగా.. ఇతర క్రికెటర్లు సొంత కారుణాలతో ఆసిస్‌తో మ్యాచ్ ఆడటంలేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. తమ ఆటగాళ్లు అస్వస్థతకు గురైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చెప్పుకొచ్చాడు. లాస్ట్ మ్యాచ్‌కు కేవలం 12 మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ ముందు భారత జట్టుకు ఇది ఆందోళన కలిగించే అంశం కావడం గమనార్హం. మరోవైపు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. అక్షర్ పటేల్ అందుబాటులో లేడన్న కెప్టెన్.. అతనికి ప్రత్యమ్నాయంగా ఆశ్విన్‌ను తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. ఆసిస్‌తో జరుగనున్న చివరి మ్యాచ్‌కు ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంపై మాజీలు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్డే మ్యాచ్‌కు ప్లేయర్లు అందుబాటులో లేకపోతే బీసీసీఐ ఏం చేస్తోందని ప్రశ్నించారు. 12 మంది ప్లేయర్లతో ఎలా ఆడుతారని ప్రశ్నించారు. సెలక్టర్లు మ్యాచ్‌లో ప్లేయర్లు లేకపోతే ఇతర ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోవాలని కానీ 12 మందితో ఆడితే చాలని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. నామమాత్రపు మ్యాచ్ అని బీసీసీఐ తేలిగ్గా తీసుకుంటోందని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌లో కీలకంగా ఉండనున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా గాయపడితే పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. అలా జరిగితే బీసీసీఐ ఏం సమాధానం చెబుతోందన్నారు. కాగా రేపు ఆస్ట్రేలియాతో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత సీనియర్ ప్లేయర్లు అందుబాటులోకి వచ్చారు. కాగా ప్రస్తుతం టీమ్‌లోకి వచ్చిన వారిలో ఎవరు అస్వస్థతకు గురయ్యేరో తెలియాల్సి ఉంది. #cricketers #rohit-sharma #india #australia #illness #last #odi-match #absence #for-the-match #12-players మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి