Helicofter Crash: కుప్పకూలిన మరో హెలికాఫ్టర్ .. ఐదుగురి దుర్మరణం

నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

New Update
Helicofter Crash: కుప్పకూలిన మరో హెలికాఫ్టర్ .. ఐదుగురి దుర్మరణం

Helicofter Crash: నేపాల్‌ లో గత కొంత కాలంగా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదం ఇంకా మరువకముందే తాజాగా మరో హెలికాఫ్టర్‌ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలిపోయింది

ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఇటీవల త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలి, 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
రెండు వారాల వ్యవధిలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాది యతి ఎయిర్ లైన్స్ విమానం పొఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 72 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం నేపాల్ చరిత్రలోనే మూడో అతి పెద్ద దుర్ఘటన అని అధికారులు తెలిపారు.

Also read: పతకం కాదు..మీరే నిజమైన ఛాంపియన్‌..వినేశ్‌కి అండగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment