Crime News: ఇద్దరు ప్రియులు.. బలైన మొగుడు.. భర్తను చంపి భలే స్టోరీ అల్లిందిగా!

చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడు గగన్‌తో కలిసి భర్త వెంకట శివను భార్య రమణమ్మ హత్య చేసింది. ఏడాదిగా రమణమ్మ గగన్‌ అనే యువకుడితో పాటు బషీర్‌ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గగన్‌తో కలిసి రమణమ్మ తన ఇంట్లోనే ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు వెంకటశివ. దీంతో అతడిని రోకలిబండతో కొట్టి చంపేశారు.

New Update
Crime News: ఇద్దరు ప్రియులు.. బలైన మొగుడు.. భర్తను చంపి భలే స్టోరీ అల్లిందిగా!

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. చిన్నారులను అనాధలుగా మారుస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం ఎక్కడో అక్కడో ఎవరో ఒకరు బలైపోతున్నారు. తమ బంధాలకు అడ్డు వస్తున్నారన్న కారణాలతో హత్యలు చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసిన ఈ ఘటన చూస్తే ఈ విషయం మరోసారి స్పష్టమవుతుతోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏకంగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య ఉదంతమిది.

ఇద్దరి ప్రియులతో సహజీవనం:
పీలేర్ నియోజక వర్గం, కలకడ మండలం సింగన ఒడ్డుపల్లికి చెందిన వెంకట శివ రమణమ్మ దంపతులు బతుకుదెరువు కోసం ఏడాది క్రితం మదనపల్లికి వచ్చి స్థానిక టమాటా మార్కెట్లో కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని నీరుగట్టువారి పల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో రమణమ్మకు ఇంటి పక్కనే ఉన్న గగన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలాగే షేక్ బషీర్ అనే వ్యక్తితో కూడా ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఈ ఇద్దరు ప్రియులతో రమణమ్మ సహజీవనం చేస్తుండేది. ఏడాదిగా ఇది కొనసాగుగుతుండగా... ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన వెంకట శివ అతని భార్య గగన్‌లో కలిసి ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు.

రోకలిబండతో కొట్టి చంపారు:
రమణమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు వెంకటశివ. గగన్‌ గురించి నిలదీశాడు. దీంతో రగిలిపోయిన రమణమ్మ, గగన్‌ ఇద్దరు కలిసి వెంకట శివ తలపై రోకలిబండతో కొట్టారు. అంతేకాకుండా గగన్ అక్క బిందుప్రియ సహాయంతో వెంకట శివ మెడకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య రమణమ్మ .. తన భర్త మద్యం సేవించి కిందకు పడి తలకు బలమైన గాయం తగిలించుకొని ఇంటికి వచ్చాడని, ఎవరు కొట్టారో ఏమైందో తనకు తెలియదని స్టోరీ అల్లింది. హాస్పిటల్‌కు తీసుకెళ్దాం అనుకునే లోపే ప్రాణాలు విడిచారని, వెంకట శివ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంకట శివ మృతదేహాన్ని ఒక ఆటోలో సింగనా వడ్డిపల్లికి తీసుకెళ్లగా, అక్కడ అతని బంధువులు మృతదేహంపై గాయాలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఎంక్వైరీలో తేలిన నిజాలు:
మదనపల్లి వన్ టౌన్ సిఐ మహబూబ్ బాషా అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి తీసుకొచ్చారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు ముమ్మాటికి ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని డిసైడ్ అయ్యారు. రమణమ్మను పోలీసులు విచారించగా..అసలు నిజం బయటపడింది. రమణమ్మ చెప్పిన విషయాలు చూస్తే పోలీసులే అవాక్కైనట్లు తెలిపారు. 20 గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులు రమణమ్మ, గగన్, బిందుప్రియ లను అరెస్టు చేశారు. షేక్ బషీర్ భాష పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి కేశప్ప చెప్పారు.

Also Read: ట్యూషన్ కి వెళ్లిన బాలుడు..తిరిగి శవమై తేలాడు..అసలేం జరిగిందంటే..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment