Andhra Pradesh : ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

ఇంకా కాసేపట్లో బీ-ఫారాలు అందజేస్తారు అనగా ఇప్పుడు ఆంధ్రా టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి, దెందులూరు అభ్యర్థుల స్థానాలను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై మరికొంత సేపటిలో క్లారిటీ రానుంది.

New Update
Andhra Pradesh : ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

TDP : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) టీడీపీ అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీ ఆన్ని స్థానాల అభ్యర్థుల పేర్లనూ ప్రకటించింది. ఈరోజు అందరికీ బీ ఫారాలను కూడా అందజేయనుంది. అయితే ఈ టైమ్‌లో టీడీపీ అధిష్టానం నాలుగు, లేదా ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సర్వేలు, ఫలితాలు, గెలుపోటముల టాక్‌లను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ విషయం చర్చించేందుకే ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju), మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్సీ సెల్‌ నేత ఎంఎస్‌ రాజు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారని చెబుతున్నారు.

రఘురామకృష్ణం రాజుకు ఉండి టికెట్ కేటాయిస్తారని చెబుతున్నారు. అలాగే మడకశిర నుంచి ఎమ్మెస్ రాజు(MS Raju)కు, కమలాపురం టికెట్ పుత్తా నర్సింహారెడ్డికి కేటాయిస్తారని చెబుతున్నారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఇక పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు తెలిసింది. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. మార్పుల్లో భాగంగా ఇప్పుడు అక్కడి నుంచి రామకృష్ణను అభ్యర్థిగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే బీఫామ్ తీసుకునేందుకు చంద్రబాబు(Chandrababu) నివాసానికి నేతలు తరలివచ్చారు. అక్రమంలో స్థానాల మార్పు గురించి తెలిసి షాక్ అవుతున్నారు. దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌కు ఇలాంటి షాకే తగిలింది. బీ ఫామ్ తీసుకోవడానికి చింతమనేనికి ఇప్పటికి వరకు రాకపోవడంతో ఆయన ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఉండిలో రామరాజు స్థానంలో రఘురామకృష్ణం రాజుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రామరాజుతో కలిసే ముందుకు వెళ్తామని రఘురామ చెబుతున్నారు. కానీ అటువైపు రామరాజు నుంచి ఇప్పటి వరకు దీనిపై ఎటాంలి రియాక్షన్ రాలేదు. మధ్యాహ్నం రామరాజుతో కలిసి నియోజకవర్గ కార్యకర్తలతో.. రఘురామ కృష్ణంరాజు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రామరాజు వస్తారా..వచ్చినా ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాల మీద కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది.

Also Read:Telangana : ఇంకా తేలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

Advertisment
Advertisment
తాజా కథనాలు