ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఆ ముగ్గురికి బెయిల్!
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసింది.
గుంటూరు జిల్లా గ్రామీణ మండలం తురకపాలెంలో అంతుచిక్కని మరణాలు కలవరం రేపుతున్నాయి. గడచిన 60 రోజుల్లో గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోయారు...? దీంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ గ్రామానికేమైంది...? అంటూ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ ఈ బెయిల్ మంజూరు చేసింది.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రికి రానుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 15 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ముందు వెళ్ళుతున్న గ్రానైట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాల కాగా వారిలో 5 మంది కి తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పారిపోయారు. ఖైదీలిద్దరూ జైలు వార్డర్‌పై సుత్తితో దాడిచేసి పరారీ కావడం కలకలం రేపింది. పరారైన ఖైదీల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి కాగా, మరోకరు చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గణేష్ నిమజ్జన ఊరేగింపులో పోలీసులు రెచ్చిపోయారు. యువకులపై పిడిగుద్దులు గుద్దుతూ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం. కర్నూలు జిల్లాల్లో నిమజ్జన ఊరేగింపులో ఓ డీజే వ్యాన్ డ్రైవర్ల పై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
ఏపీ లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గణేష్ మండపం వద్ద చికెన్ తో భోజనాలు పెట్టడం వివాదస్పదమైంది. అయితే ఇది మండప నిర్వహకులు పెట్టింది కాదు. వైఎస్ వర్థంతి సందర్భంగా గణేష్ మండపాన్ని ఆనుకొని వైసీపీ నాయకులు ఈ భోజనాలు వడ్డించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.