/rtv/media/media_files/2025/03/17/q7RJvhqiHmtb7fYdGFW1.jpg)
YV Subba Reddy mother Photograph: (YV Subba Reddy mother)
వైసీపీ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (84) సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంతో ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో గత కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆమె నేడు కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లకు పిచ్చమ్మ పార్ధీవదేహాన్ని తరలిస్తారు.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
పెద్దాయన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారి మాతృమూర్తి పిచ్చమ్మ గారు కన్నుమూత... pic.twitter.com/u6wtFWgzLH
— DSR🦅 (@dakasrinu) March 17, 2025
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
దహన సంస్కరణలు అక్కడే..
అక్కడే దహన సంస్కరణలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే పిచ్చమ్మ పార్ధీవదేహానికి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది.