AP High Court : ఏపీలో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా తమ ముందు హాజరుకావాలని కసిరెడ్డికి సీఐడీ (CID) నోటీసులు (సీఆర్పీసీ సెక్షన్ 160) ఇచ్చింది. అయితే సీఐడీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచే ముందు సహేతుకమైన సమయం ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!
ఇదే విషయంలో గతంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిన్న (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. మద్యం కుంభకోణం కేసులో గత ఏడాది సెప్టెంబర్ 23న సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు.
Also read: హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు
ఈ కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేరారోపణలూ లేవని, విచారణకు హాజరుకావాలని ఆదేశించలేదని సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున అరెస్ట్ చేస్తారనే ఆందోళన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో ఈ బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదని సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఏప్రిల్ 3కు వాయిదా వేయగా.. నిన్న మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభ లో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆయనను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటిబొట్టంతేనని ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. రూ 90 వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అవి కాకుండా మరో రూ. 4వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై అమిత్ షా ఆరా తీశారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!