YSRCP: వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్!

వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

New Update
ycp

AP Crime : దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.  తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు సమాచారం.

Also Read: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు!

Pinipe Viswarup Son Srikanth Arrest

ట్రాన్సిట్‌ వారెంట్‌ పై ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అరెస్ట్ ను రాష్ట్ర పోలీసు అధికారులు నిర్థారించాల్సి ఉంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండే ళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు సమాచారం. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. 

Also Read: యహ్యా సిన్వార్ ఓ కసాయే...అడ్డొస్తే చంపేయడమే!

ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ , మృతుడికి స్నేహితుడైన వడ్డీ ధర్మేశ్‌ ను పోలీసులు విచారించారు. అతడిని ఈ నెల 18న అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మధురైలో శ్రీకాంత్‌ ను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

ఈ నెల 18న ధర్మేశ్‌ ను విచారించి , వివరాలు సేకరించినట్లు తెలిసింది. అతడు..మృతుడు దుర్గాప్రసాద్‌, శ్రీకాంత్‌ లకు సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. దుర్గాప్రసాద్‌ ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్‌...ధర్మేశ్‌ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: బాచుపల్లిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..!

హత్యకు స్థానికంగా ఓ ప్రముఖ లాడ్జిలో పథకం వేశారు. దుర్గా ప్రసాద్‌ ను ధర్మేశ్‌ కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనం పై తీసుకెళ్లగా , వెనుక కారులో నలుగురు ఫాలో అయ్యారు. రేవు వద్ద ఓ వ్యక్తి పడవలో లోపలకు తీసుకెళ్లగా , కారులో వచ్చిన వారిలో ముగ్గురు దుర్గా ప్రసాద్‌ మెడకు తాడు బిగించి, హత్య చేశారని నిందితుడు ధర్మేశ్‌ చెప్పినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు ముందుకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Also Read: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

కొన్నాళ్లకు మృతదేహం లభించడం , పోస్టుమార్టంలో హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు