/rtv/media/media_files/2025/02/12/Xh0436MTiI6YzOruHmF0.jpg)
YS Jagan Sharmila
కంటిలో రాయి కింద మారిన చెల్లి షర్మిలను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలను వైసీపీ వైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన రఘవీరారెడ్డి, హర్ష కుమార్ తదితర నేతలపై ఆయన ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఇటీవల కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరినట్లు తెలుస్తోంది.
వైఎస్ తో క్లోజ్ ఉన్న నేతలతో..
మాజీ ఎంపీలు హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అంతా ఖాళీ అయ్యి వైసీపీ, ఇతర పార్టీల్లో నేతలు చేరిపోయినా వీరు మాత్రం ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరందరినీ వైసీపీలోకి తీసుకురావాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి కొత్త ఊపు రావడంతో పాటు కాంగ్రెస్ ఖాళీ అవుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పల్లం.. హర్ష కుమార్ పక్కా అంటున్నారు..
— Nagarjuna (@pusapatinag) February 11, 2025
మిగిలిన ఇద్దరి సంగతి ఐతే క్లారిటీ లేదు.. (నాకు తెలిసిన Source) https://t.co/zFsGgjcU79
చెల్లికి చెక్..
ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న జగన్ సోదరి షర్మిల.. నిత్యం అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ జగన్ ను ఇరుకున పెడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ ను ప్రధాన పార్టీగా మార్చాలని ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా షర్మిలను ఆత్మరక్షణలో పడేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న నేతలతో పాటు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరో రెండు నెలల్లో ఈ చేరికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.