YS Family: వైఎస్‌ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!

వైఎస్ జగన్, షర్మిల విభేదాలు రచ్చకెక్కడంతో వారి ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు జగన్ వెంట ఉండగా.. విజయమ్మ, సునీత, సౌభాగ్యమ్మ తదితరులు షర్మిల వైపు ఉన్నారు.

New Update
YS Family sharmila Jagan

వైఎస్‌ కుటుంబం రెండు ముక్కలుగా చీలిపోయిందా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్‌ కుటుంబంలో ఆస్తుల తగాదా ఏ స్థాయికి చేరుకుందో చూశాం. మరీ ముఖ్యంగా జగన్‌, షర్మిలకు సంబంధించిన అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్‌, షర్మిలకు సంబంధించి కుటుంబంలో ఎవరెవరు ఎటువైపు ఉన్నారు..? అనే చర్చ జోరందుకుంటోంది. అసలు ఈ వివాదం మొదలైంది ఎన్‌సీఎల్‌టీలో జగన్‌ పిటిషన్‌ వేసినప్పటి నుంచేనని తెలుస్తోంది. అయితే జగన్‌ పిటిషన్‌పై షర్మిల రియాక్ట్‌ అయ్యారు. ఆస్తులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం జగన్‌ కూడా ఈ అంశంపై రియాక్ట్‌ అయ్యారు. అనంతరం టీడీపీ జగన్‌, షర్మిల మధ్య జరిగిన వాదనలకు సంబంధించిన లేఖలను టీడీపీ విడుదల చేసింది. ఆ లేఖలు బయటపడ్డప్పటి నుంచి ఆస్తుల వివాదం మరింత ముదిరింది. అయితే టీడీపీ లేఖలపై జగన్‌ స్పందించారు. అనంతరం జగన్‌ వ్యాఖ్యలపై షర్మిల కూడా స్పందించారు.

Also Read :  దీపావళి రోజు ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్.. సడెన్ గా ఫ్యాన్స్ మధ్యలోకి

జగన్ కు సపోర్ట్ గా సుబ్బారెడ్డి, సజ్జల..

ఈ మధ్యలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల స్పందించారు. ఆస్తులన్నీ జగన్‌ సొంతమని, ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఎప్పుడో జరిగిపోయాయని కుండబద్దలు కొట్టారు. అనంతరం దీనిపై షర్మిల మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. నా బిడ్డలకు అన్యాయం చేసేందుకు వారు సిద్ధమయ్యారని తెలిపారు. అన్ని విషయాలకు సాక్ష్యం మా అమ్మ అని తెలిపారు. అయితే ఆ మరుసటి రోజే ఆస్తుల వివాదంపై రచ్చ జరుగుతున్న సమయంలో విజయమ్మ తెరమీదకు వచ్చారు. ఆస్తులకు సంబంధించిన వివాదంపై ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అసలు నిజం ఏమిటో తెలియజేస్తూ వైఎస్‌ అభిమానులకు ఓ లేఖను విడుదల చేశారు. 

Also Read :  షర్మిలకు కౌంటర్‌గా జగన్ సంచలన వ్యూహం!

ప్రస్తుతం ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులని, ఎలాంటి పంపకాలు జరగలేదని తెలియజేసింది. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడటం సరికాదని తెలిపింది. తనకు ఇద్దరు బిడ్డలు ఒక్కటేనని.. నిజానిజాలు తెలియజేసేందుకు ఈ లేఖ రాసినట్లు తెలిపారు. దేవుడే తమ బిడ్డల ఆస్తి తగాదాలు తీరుస్తాడని తెలిపారు. అయితే విజయమ్మ లేఖపై కూడా వైసీపీ మరో లేఖను విడుదల చేసింది. అయితే దీనిపై కూడా షర్మిల బుధవారం నాడు స్పందించారు. ఎంవోయూ చేసుకున్నప్పుడు లేని వివాదం ఇప్పుడెందుకు వచ్చిందని మండిపడ్డారు. అయితే ఇరు వర్గాల వాదనల నేపథ్యంలో వైఎస్‌ ఫ్యామిలీ రెండుగా విడిపోయింది.

Also Read :  బెంగళూరులో బ్రిటన్ రాజు రహస్య పర్యటన.. కారణమేంటో తెలుసా?

ఎవరు ఎటు వైపు..?

జగన్‌, షర్మిల ఆస్తుల వివాదంలో కొందరు జగన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతుండగా.. విజయమ్మ మాత్రం తన కుమార్తె చెప్పిందే నిజమని తెలిపింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ కుటుంబంలో ఎవరు ఎవరి వైపు ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే బుధవారం నాడు మాజీ సీఎం జగన్‌ పులివెందుల పర్యటనలో భాగంగా తన కుటుంబం, బంధువులను కలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి మద్దతు తన వైపు ఉండేలా చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం వారితో మాట్లాడుతూ, వారి సూచనలు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా జగన్‌ ఎందుకు తన కుటుంబ సభ్యుల మద్దతు కూడగడుతున్నారనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదం వైఎస్‌ను ఆస్తిని గతంలోనే పంచారని.. లేదు పంచలేదన్న విషయాలపై జగన్‌, షర్మిల మధ్య వాదనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నవన్నీ జగన్‌ సంపాదించుకున్న ఆస్తులని.. వాటిలో కొంత తన చెల్లికి ఇద్దామనుకున్నారని జగన్‌ తరపు వ్యక్తులు వాదిస్తున్నారు. అయితే దీనికి ప్రధానంగా బలం చేకూర్చేది కుటుంబం. అందుకనే జగన్‌ కుటుంబ సభ్యుల మద్దతు కూడగడుతున్నారనే వాదన వినిపిస్తోంది. 

Also Read :  షర్మిలకు ప్రాణహాని!

జగన్‌వైపు ఉన్నది వీళ్లే

1. వైవీ సుబ్బారెడ్డి (బాబాయి)
2. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి (సోదరుడు)
3. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి (బాబాయి)
4. వైఎస్‌ మనోహర్‌ రెడ్డి (బాబాయి)
5. విమలమ్మ (మేనత్త)
6. రవీంద్రనాథ్‌ రెడ్డి (మేనమామ)
7. దుక్కాయపల్లి మల్లిఖార్జున రెడ్డి (బాబాయి)

షర్మిల వైపు ఉన్నది వీళ్లే..

  1. వైఎస్‌ విజయమ్మ (తల్లి)
    2. అనిల్‌ కుమార్‌ (భర్త)
    3. వైఎస్‌ సునీత (సోదరి)
    4. వైఎస్‌ సౌభాగ్యమ్మ (చిన్నమ్మ)
    5. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి (వరుసకు మామ)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment