Geethu Royal : తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ రీల్స్‌..టీటీడీ సీరియస్‌

తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేం. బబర్ధస్త్‌ ఆర్టిస్ట్ గీతూ రాయల్ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనిపై టీటీడీ సీరియస్ అయింది.

New Update
FotoJet (15)

geeturoyal

Geethu Royal :  తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు మాత్రం తరుచుగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో రీల్స్ చేస్తూ ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. తాజాగా  బిగ్‌బాస్‌ ఫేం. బబర్ధస్త్‌ ఆర్టీస్ట్‌, యూట్యూబర్‌ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీంతో టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. గీతూ రాయల్ గుడి ముందే సినిమా పాటలకు స్టెప్పులేసింది. వాటిని రీల్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదాస్పదమైంది.

 గీతూ రాయల్‌ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ క్రమంలో తన నలుగురు స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆమె  ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ దగ్గర డ్యాన్సులు చేస్తూ రీల్స్‌ తీసింది. పవిత్రమైన తిరుమల ఆలయం ఎదుట ముందు నిలబడి ‘ఖడ్గం’ సినిమాలోని ఒక పాటకు రీల్ చేసింది.  అనంతరం వాటిని వీడియోగా చేసి ఇన్ స్టాలో రీల్ అప్‌లోడ్ చేయడం వివాదంగా మారింది. దీంతో ఈమెపై పలువురు విమర్శలు చేశారు. దీంతో సదరు రీల్‌ని డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఆ రీల్‌ వైరల్‌గా మారడంతో టీటీడీ దృష్టికి వెళ్లింది. దీంతో ఈమెపై టీటీడీ చర్యలకు కూడా సిద్ధమైంది. ఇదే విషయాన్ని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసింది.  

తనపై విమర్శలపై స్పందించిన గీతూ రాయల్ మరో వీడియోను విడుదల చేసింది. తనపై వస్తున్న వార్తలపై ఆమె వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. ఈ వ్యంగ్య వీడియో మరింత వివాదానికి దారి తీసింది. తప్పును ఒప్పుకోకుండా వెటకారం చేయడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిబంధనల పట్ల ఆమెకు గౌరవం లేదని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తిరుమల పవిత్రతను పణంగా పెట్టవద్దని పలువురు అంటున్నారు. అధికారులు విచారణ జరిపి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. ఈ వివాదం తిరుమల భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

తన పెట్టిన పోస్టులో 'అందరికీ ఒక గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారట. ఇక హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను. పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరు తీసేసి సంతోషంగా ఉండండి' అని గీతూ తన లేటెస్ట్ వీడియోలో చెప్పుకొచ్చింది. మా టీమ్‌లో ఒకరికి టోకెన్ రాలేదు, అతని కోసం వెయిట్ చేస్తున్న సమయంలో స్వామివారి పాటలకు రీల్స్ చేశాను. దేవుడిపై భక్తి లేక కాదు, కేవలం ఆ సమయంలో సరదాగా చేశానంతే. నేను ఆ వీడియోలను డిలీట్ చేశాను. అని గీతూ  చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికే ఆమె చేసిన రీల్స్‌ వైరల్‌ కావడంతో టీటీడీ చర్యలకు ఉపక్రమించింది.
 

Advertisment
తాజా కథనాలు