Jogi Ramesh : జోగి ఇంటి ముందు అత్యుత్సాహం ప్రదర్శించిన యువకులు!

ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.జోగి రమేష్‌ ఇంటి ముందు వినాయకుడి ఊరేగింపును ఆపి, బాణాసంచా పేల్చడంతో పాటు , టీడీపీ జెండాలు ప్రదర్శించారు.

author-image
By Bhavana
New Update
jogi

Jogi Ramesh : వినాయక నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.

జోగి రమేష్‌ ఇంటి ముందు వినాయకుడి ఊరేగింపును ఆపి, బాణాసంచా పేల్చడంతో పాటు , టీడీపీ జెండా ప్రదర్శించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment