YCP: అందుకే షర్మిలపై జగన్ పిటిషన్... YCP సంచలన ట్వీట్! సరస్వతి పవర్ వారసత్వపు ఆస్తి కాదని.. లీగల్ సమస్యలున్నాయని వైసీపీ ట్వీట్ చేసింది. కంపెనీ షేర్లు బదిలీ చేయడం చట్టవిరుద్ధమని.. అలా చేస్తే జగన్ బెయిల్ రద్దుకు అవకాశం ఉందని పేర్కొంది. ప్రేమ ఉంది కాబట్టే షర్మిలకు పదేళ్లలో జగన్ రూ.200 కోట్లు ఇచ్చారని తెలిపింది. By V.J Reddy 24 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Jagan : ఆస్తి వ్యవహారంలో తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై అధికార టీడీపీ జగన్ పై విమర్శలు చేస్తుండగా.. వైసీపీ దానిని ఖండించింది. షర్మిలపై జగన్ ఎందుకు పిటిషన్ వేశారో వైసీపీ ట్వీట్ చేసింది. వారసత్వపు ఆస్తులు కానప్పటికీ, స్వార్జితం అయినప్పటికీ తన చెల్లెలి మీదున్న ప్రేమాభిమానాలతో జగన్ ఇస్తానని కమిట్‌మెంట్ చూపించి ఎంఓయూ రాసిఇచ్చారు. కేసులు తేలాక ఆస్తులు అప్పగిస్తామని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ చట్టవిరుద్ధంగా షేర్లు బదిలీ చేయడమే ఇప్పటి సమస్యకు దారితీసింది. ఈ రోజుతో మీ బండారం బయట పడింది శాడిస్ట్ @ncbn. ముసుగులూ తొలగిపోయాయి. మీరంతా ఒకటే సిండికేట్ అని ప్రజలకి అర్థమైంది..కుటుంబాల్లో అనుబంధాలు గురించి, ప్రేమాభిమానాల గురించి చంద్రబాబుగారి @JaiTDP మాట్లాడ్డం దెయ్యాలు వేదాలు వల్లించడమే. తోబుట్టువులకు, సోదరులకు, బావమరుదులకు, చివరకు… pic.twitter.com/0LqwXfIcbw — YSR Congress Party (@YSRCParty) October 23, 2024 Also Read : మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ.. 'అమరన్' ట్రైలర్ చూశారా జగన్‌కి ఇబ్బందులు.... ఇది లీగల్‌గా జగన్‌కి ఇబ్బందులు తెచ్చే విషయమని న్యాయవాదులు చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లీగల్ స్టెప్ తీసుకున్నారు. చెల్లెలిపై ప్రేమ చూపకూడదని అనుకుంటే, జగన్ ఎంఓయూ రాసిచ్చేవారు కాదు కదా? అని ప్రశ్నించింది. సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి, 2021లో జగన్ గిఫ్ట్ డీడ్‌కు పరిమితం అయ్యారు. లీగల్ అవకాశం ఉంటే.. ఆరోజే షేర్లన్నింటినీ బదిలీచేసేవారు కాదుకదా? కానీ, షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని తెలిసికూడా, బదిలీచేశారంటే.. ఇది జగన్‌ని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేయడమే కదా? అని పేర్కొంది. ఆయన బెయిల్ రద్దుకు తగిన పరిస్థితులను సృష్టించడమే కదా? అభిమానంతో మంచి చేయబోయి తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి జగన్‌ది, లక్షల కోట్లకుపైగా ఆస్తులండీ చిల్లి గవ్వకూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబుది. ఇంతటి పరిస్థితుల్లో పదేళ్లలో రూ.200 కోట్లు జగన్ తన చెల్లెలికి ఇవ్వడం ఇందులో కొసమెరుపు.' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. Also Read : బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..! వచ్చే నెల 8న విచారణ... తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ సీఎం జగన్, భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై NCLTలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్, భారతి పిటిషన్ ఫైల్ చేశారు. కంపెనీ అభివృద్ధి కోసం తాము కృషి చేశామని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2019, ఆగస్ట్ 21 MOU ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్ల కేటాయించామని.. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని వివరణ ఇచ్చారు.ఇప్పుడు ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. Also Read : నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన ఈ షేర్ల కేటాయింపు జరగకపోవడంతో వివాదం చెలరేగింది. తన చెల్లి అని పేరుతో ఆరోజు షేర్లు ఇచ్చేందుకు అంగీకారించమని పిటిషన్ లో వివరణ ఇచ్చారు జగన్. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇల్లీగల్ ఆమె మార్చుకునే ప్రయత్నం చేసిందని.. వాటిని విత్ డ్రా చేయాలని జగన్, భారతి పిటిషన్ లో వివరించారు. కంపెనీలో తమకు 51 శాతం వాటా ఉందని డిక్లేర్ చేయాలని వినతి చేశారు. కాగా జగన్ పిటిషన్‌పై నవంబర్ 8న విచారణ జరగనుంది. దీనిపై షర్మిల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. Also Read : భర్తను అలా పిలవడం క్రూరత్వం.. కోర్టు కీలక తీర్పు! #ycp #ys-jagan #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి