/rtv/media/media_files/2025/04/02/nhxLkXu8P2z8l4UdfrtY.jpg)
మాజీ మంత్రి కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఈ రోజు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు ఈ సర్జరీ నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో నాని సన్నిహితులు, వైసీపీ శ్రేణులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కొడాలి నాని ఉన్నారు. మరో వారం రోజుల్లో నానిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ట్రిక్ సమస్యతో వారం రోజుల కిందట గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కొడాలి నాని చేరారు. నానికి అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు.
ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!
మెరుగైన చికిత్స కోసం ముంబైకి..
అయితే సర్జరీ చేసేందుకు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి సహకరించదని ఏఐజీ వైద్యులు అంచనాకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నానిని సోమవారం మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో బైపాస్ సర్జరీ జరిగింది. డాక్టర్ పాండాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. గతంలో మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్, కొనకళ్ల నారాయణ, రఘురామకృష్ణంరాజు తదితర ప్రముఖులకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. ఇప్పడు కొడాలి నాని బైపాస్ సర్జరీ సైతం విజయవంతంగా పూర్తి చేశారు.
ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!
(kodali-nani | telugu-news | telugu breaking news | latest-telugu-news)