ఆ భయంతోనే విజయసాయి రాజీనామా.. బయటకు చెప్పకపోయినా అసలు నిజం అదే!

ఈడీ, సీబీఐల భయంతోనే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదన్నారు. విజయసాయి ఈ విషయాన్ని ఖండించినప్పటికీ ఇదే అసలు కారణమన్నారు.

New Update

పాలిటిక్స్ కు ఇక దూరం అంటూ విజయసాయిరెడ్డి ప్రకటనపై వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి, జగన్‌కు విజయసాయి అత్యంత నమ్మకమైన వ్యక్తి అన్నారు. ఢిల్లీలో జగన్‌ వ్యవహారాలన్ని విజయసాయి చూసుకున్నారన్నారు. గవర్నమెంట్‌ వచ్చాక విజయసాయికి విశాఖ, ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ బాధ్యతలు ఇచ్చాక కొన్ని తప్పులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజీనామాకు కాకినాడ సెజ్‌ కారణమని అంటున్నారని కేతిరెడ్డి బాంబ్ పేల్చారు.

ఈడీ, సీబీఐతో టార్గెట్..

ఈడీ, సీబీఐలతో ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదన్నారు. విజయసాయి ఈ విషయాన్ని ఖండించినప్పటికీ ఇదే అసలు కారణమన్నారు. ఈడీ, సీబీఐల భయంతోనే రాజీనామా చేశారన్నారు. లేకపోతే ఆయన ఇప్పుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కేతిరెడ్డి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Kiss Video: ఛీ ఛీ.. లైవ్‌లో ముద్దులతో రెచ్చిపోయిన అఘోరీ-శ్రీవర్షిణి.. కారులో రచ్చ రచ్చ

అఘోరీ - శ్రీవర్షిణి కారులో రెచ్చిపోయారు. లైవ్‌లో ఉండగానే ముద్దులతో రచ్చ రచ్చ చేశారు. వర్షిణి అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెవల్ల తన లైఫ్ టర్న్ అయిపోయిందని అఘోరీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే వర్షిణి బుగ్గపై ముద్దు పెడుతూ ఐలవ్ యు చెప్పింది.

New Update

అఘోరీ-శ్రీవర్షిణి తమ కార్‌లో ముద్దులతో రెచ్చిపోయారు. వర్షిణి తనకు దొరికిన మేలిమి బంగారమని తెగ పొగేడిసింది అఘోరీ. ఈ మేరకు వర్షిణిని పొగుడుతూ ముద్దులతో రచ్చ రచ్చ చేసింది. ‘‘వర్షిణి చాలా మంచిది. తను నాకు దొరికిన వజ్రం. నా లైఫ్ ఆమె వల్ల ఫుల్ టర్న్ అయిపోయింది. 

Also read : తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

సభ్యసమాజం ఎలా ఉంటుంది.. ఎలా మాట్లాడతారు అనేది మొత్తం నేర్పించింది వర్షిణి. అందువల్లనే జీవితంలో వర్షిణి నేను ఇలాగే హ్యాపీగా ఉంటాం. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. లవ్ యు చిన్నూ. జీవితాంతం ఇలాగే కలిసి ఉంటాం. ఎవరెన్ని మాట్లాలు అన్నా.. ఎవరెంత బురద చల్లినా.. నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగానే ఉందాం.’’ అంటూ వర్షిణి బుగ్గపై ముద్దు పెట్టి రచ్చ రచ్చ చేసింది.

Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

ముద్దులతో రచ్చ రచ్చ

దానిపై వర్షిణి కూడా నవ్వుతూ థాంక్యూ అంటూ చెప్పడం చూడవచ్చు. అంతేకాకుండా వర్షిణి తనను బావా అని పిలుస్తుంది అని అఘోరీ చెప్పుకొచ్చింది.  ఆశ్రమం కట్టడానికి ప్రయత్నిస్తున్నామని.. అది పూర్తయ్యాక త్వరలో తమ పేరెంట్స్, వర్షిణీ పెరెంట్స్‌ను తీసుకుని వెళ్లిపోతామని తెలిపారు.

Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

తమ ఆశ్రమంలో అన్ని సమస్యలు ఎదుర్కొన్న వారికి చోటు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకునే వారికి చోటు కల్పిస్తామని అన్నారు. ఏది ఏమైనా అఘోరీ, శ్రీవర్షిణి ముద్దులతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

aghori sri varshini | Aghori Sri Varshini Lov | sri varshini | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment