/rtv/media/media_files/2025/03/08/sTmu71BAPxTh7wN8SeiP.jpg)
Woman's Day 2025 CM Chandrababu Naidu
మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. స్వయంకృషితో ఎదిగిన మహిళలను అభినందించారు.
Woman's Day 2025 CM Chandrababu Naidu
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
Tirumala Tirupati Devasthanam
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హనుమంత వాహనసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.
Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!
ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.
శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.