Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. మరోవైపు భద్రాచలం వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది.
AP: రోజురోజుకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నమోదు అయింది. స్పిల్ వే ద్వారా 7 లక్షల 96 వేల 686 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక వ్యక్తిని మహిళ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. మృతున్ని చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్ (30) గా పోలీసులు గుర్తించారు.
ఏలూరు జిల్లా జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామ లాజర్ను అల్లుడు సుబ్బారావు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేయగా లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పరారీలోని నిందితుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుండి (4,84,022) నాలుగు లక్షల 84 వేల 22 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం స్పిల్ వే ఎగువన 30.00 మీటర్లుగా నీటిమట్టం నమోదయినట్టు అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.జంగారెడ్డి గూడెం కొంగవారి గూడెం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది.