Weather: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరుతున్నాయి. జనవరి నెల ప్రారంభం అయిన రోజు నుంచి ఇప్పటివరకు కనిష్ట ఉష్ణోగ్రత 18 నుంచి 13 డిగ్రీలకు పడిపోయాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాలో రెండు రోజులుగా 16° చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని వాతావరణానికి చలి తోడు కావడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చెందినవారు బయటకు వెళ్లాలంటే చలితో ఇబ్బంది పడుతున్నారు. మెదక్‌లో 9.8 డిగ్రీల కనిష్ఠ, పటాన్‌చెరులో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాకా.. ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోతునట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు:
అయితే ఈ సంవత్సరం చలి పెరిగిదని చెప్పాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో చలి ఎక్కువగా ఉంటుంది.. కానీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో తుఫాను కారణంగా కొన్ని రోజులు చల్లని వాతావరణ ఉంది. దీని ప్రభావం వలన చలి కూడా చూపలేదు. అయితే ఒక 15 రోజుల ముందుగా అంటే డిసెంబరు నెల చివరిలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈనెల రెండవ తేదీ నుంచి కొన్ని జిల్లాలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇది కాస్త ఇంకా పెరిగే పెరగడంతో జిల్లా ప్రజలు చలి పంజాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మంచు దాడి:
ప్రతిరోజు ఉదయం 3, 4 గంటల ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది. ఉదయం 10 గంటలు అవుతున్న గాని మంచు విడవడం లేదు. కొన్ని ప్రాంతాలలో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చలి గాలులు కూడా ఎక్కువగా వేస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు తగ్గకుండా పెరగకుండా నమోదు అవుతూ ఉన్నాయి. ఎక్కువ చలి ఉండటం వలన ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రత నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వంటగది సింక్ జామ్ అయితే ఇలా చేయండి