Andhra Pradesh: విశాఖపట్నం బీజేపీ ఎంపీ సీటు దక్కేదెవరికో..
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఎంపీ సీటు కోసం బీజేపీ అభ్యర్ధుల మీద తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు ఇద్దరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఎంపీ సీటు కోసం బీజేపీ అభ్యర్ధుల మీద తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు ఇద్దరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
అనకాపల్లి నర్సీపట్నంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇంటిపై జెండా కట్టవద్దన్నందుకు కుటుంబంపై దాడికి దిగారు. దాడిలో వాలంటీర్ తో పాటు నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడిలో బాధితులు పళ్లు ఊడిపోయి, గాయాల పాలైన బాధితులు ఏరియా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఫైనల్ చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 17 సీట్లలో పోటీ చేస్తుండగా.. పది మంది పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. మరో 7 స్థానాలపై కసరత్తు సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే తన పార్టీ తరుఫున 175 మంది అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు ప్రచారానికి రెడీ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్.
రాజధానిపై వైసీపీకి అసలు క్లారిటీనే లేదని విమర్శించారు లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్. ఏపీలో తుగ్లక్ పాలన నడుస్తుందని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంతో పాటు తెలుగు రాజకీయ పరిణామాలపై జేపీ ఏం అన్నారో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
మంత్రి గుడివాడ అమర్నాథ్ కు రానున్న ఎన్నికల్లో టికెట్ ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆయన కూడా మరోసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.
అనకాపల్లి నియోజకవర్గంలో జనసైనికులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేపట్టారు. స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ విశిష్టతను వివరిస్తున్నారు.
టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా ప్రకటించిన సెకండ్ లిస్టులో తనకు పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించిన బాబ్జి.. టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి చంద్రబాబును కలిశారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచే పోటీ చేయమని చెబుతున్నారు. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.