Ap: కృష్ణా నదిలో వరద..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణాదిలో నీరు పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కి కూడా 7 గేట్లను ఎత్తారు. By Manogna alamuru 19 Oct 2024 in విజయవాడ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి SriSailam,nagarjuan sagar, prakasam dams... బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కోస్తా, రాయలసీయల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో కృష్ణానది పరవళ్ళు తొక్కుతోంది. నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది. Also Read: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..వాటర్ బాటిళ్ళు, సైకిళ్ళపై తగ్గింపు నాగార్జనా సాగర్.. అలాగే నాగార్జునా సాగర్‌లో కూడా 5 గేట్లను ఎత్తారు. జలాశయం నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. దీంతో 12 గేట్లను ఎత్తి 5 అడుగుల మేర ఎత్తి 97 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 1,38,338 క్యూసెక్కులు రావడంతో అంతే మొత్తంలో సాగర్ కుడి, ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రకాశం బ్యారేజి.. నీటి ప్రవాహం అనుగుణంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడ 70 గేట్లను ఎత్తారు ఇంజనీర్లు. ఇక్కడ 84,297 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉండగా.. 3.07 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉంది. Also Read: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి