AP: ఆంధ్రా అభివృద్ధికి సూచనలు చేయండి–సీఎం చంద్రబాబు

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే మీ సూచనలు , సలహాలు మాకు అవసరం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోఏపీ కు డైరెక్ట్‌గా సూచనలు షేర్ చేయండి..ఈ సర్టిఫికేట్‌ను పొందండి అని చెబుతున్నారు.

author-image
By Manogna alamuru
New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

AP CM Chandra Babu: 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు భాగం కండి అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గో ఏపీకి డైరెక్ట్‌గా మీ సలహాలు, సూచనలు చెప్పండి అన్నారు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంచి సలహాలు, సూచనలు ఇచ్చినవారికి ప్రుత్వం తరుఫున ఈ సర్టఫికేట్ కూడా ఇస్తామని తెలిపారు. 2047 స్వత్సరానికల్లా ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ల జిఎస్‌డిపితో..  $43,000 కంటే ఎక్కువ క్యాప్టా ఆదాయంతో భారతదేశాన్ని నడిపించడమే మా లక్ష్యమని అన్నారు. దీని కోసమే ఆంధ్రా ప్రజలను సూచనలు అఉగుతున్నామని వివరించారు చంద్రబాబు. ప్రతీ ఒక్కరి సలహా మాకు అవసరమని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ను కలిసి సిర్మించుకుందాం..అభివృద్ధి చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు ఏపీ సీఎం.

babu

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు