Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్!

విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు  తనకు నెల రోజుల పాటు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. అయితే.. కోర్టు 15 రోజులు మాత్రమే విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.

New Update
Vijayasai Reddy CBI

Vijayasai Reddy CBI

విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు 
తనకు నెల రోజుల పాటు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి కోరారు. అయితే.. కోర్టు 15 రోజులు మాత్రమే విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లొచ్చని తెలిపింది. 
ఇది కూడా చదవండి: AP Govt Jobs: 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు సంబంధించిన పలు సీబీఐ కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటు ఆయన కూడా జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఇందుకు సంబంధించిన విచారణ ఇప్పుడు జరుగుతోంది. బెయిల్ నిబంధనల ప్రకారం కోర్టు అనుమతితోనే విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం విజయసాయిరెడ్డి 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ఇది కూడా చదవండి: ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు.. ఫిబ్రవరి 1 నుంచే అమలు

రాజకీయాలకు దూరం..

వైసీపీలో  కీలక నేతగా.. ఓ దశలో నంబర్ 2 గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు ఇక దూరం అవుతున్నానంటూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. ఇక వ్యవసాయం చేసుకుంటానని ఆయన ప్రకటించారు. అన్నట్లుగా ఫామ్ హౌజ్ లో దిగిన ఫొటోలను ఇటీవల తన X ఖాతాలో షేర్ చేశారు విజయసాయిరెడ్డి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment