ఆ ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయాడు.. వైసీపీ నేత ఆరోపణలు
వైసీపీ నేత బరిగల కోటేష్ తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిపై సంచలన ఆరోపణలు చేశారు. రక్షణనిధి టీడీపీకి అమ్ముడుపోయాడని, సీఎం జగన్ పేరు చెడగొడుతున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు.
వైసీపీ నేత బరిగల కోటేష్ తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిపై సంచలన ఆరోపణలు చేశారు. రక్షణనిధి టీడీపీకి అమ్ముడుపోయాడని, సీఎం జగన్ పేరు చెడగొడుతున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ మహాసభ నిర్వహించారు. టీడీపీ నమోదు చేయించే దొంగ ఓట్ల వ్యవహారంపై వైసీపీ లీగల్ టీమ్ దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్యెల్యే మల్లాది విష్ణు. రాబోయే రోజుల్లో లాయర్ల పాత్రే కీలకమైందన్నారు.
జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో కామెంట్స్ చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోపై క్లారిటీ ఇచ్చారు కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. 2018లో గత టీడీపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై చేసినట్లుగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ మొదలైంది. సోమవారం పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, అదే రోజు సాయంత్రం 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చింది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అనంతరం పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ముఖ్యగమనిక. నేడు ఏపీ వ్యాప్తంగా పాఠశాలలకు సర్కార్ సెలవు ప్రకటించింది. ఏపీలో మిచైంగ్ తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సతీమణి కరుణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి వాగ్దేవి, ఆమె బృందం సురక్షితంగా ప్రసవం కావడానికి అన్ని చర్యలు తీసుకోవడంతో సేఫ్ గా డెలివరీ అయ్యారు.
నిర్లక్ష్యానికి వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జూన్‌లో జరిగిన ఒడిశా రైళ్ల ప్రమాదం నుంచి నిన్న జరిగిన విజయనగరం రెండు రైళ్ల ఢీకొన్న ప్రమాదం వరకు అడుగుఅడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ అక్టోబర్ 11న జరిగిన బీహార్ ట్రైన్ యాక్సిడెంట్‌లోనూ రైల్వే ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఉందని తేలింది. ఒడిశా ఘటనలో 296మంది, బీహార్ ఘటనలో నలుగురు, విజయనగరం ఘటనలో ఇప్పటివరకు 14మంది ప్రాణాలు విడిచారు.