AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు

ఒకేసారి ఆరు కొత్త పాలసీలను తీసుకొచ్చాం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ, పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. 

New Update
11

AP CM Chandra Babu: 

ఈరోజు ఏపీ కేబినెట్ మీటింగ్ సమావేశం అయింది. దీని తరువాత సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలు...పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తామని అన్నారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదుగుతారని చంద్రబాబు చెప్పారు. స్పీడ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లో భాగంగా సింగిల్ విండో 2.0 అమలు చేస్తామని తెలెఇపారు. 
అవసరం అయితే డీమ్డ్ క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. 

Also Read: Israel: లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి..మేయర్ సహా 15 మంది మృతి

అమరావతిలో రతన్ టాటా హబ్..

అమరావతితో పాటూ రాష్ట్రంలో ఐదు జోన్లలో ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ ప్రజలకు మరింత చేరువ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. నాలెడ్జ్‌ ఎకానమీకి ఏపీ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారాలన్నదే తమ లక్ష్యమన్నారు. యువత  పారిశ్రామిక వేత్తలు గా ఎదగడం లో ఆర్థిక సహకారం, మెంటార్ షిప్, నాలెడ్జి ట్రాన్స్ఫర్ లాంటి సహకారం కూడా అందించేలా కార్యాచరణ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఏం ఎస్ ఎం ఈ లను ఆదుకొనేలా చర్యలు తీసుకుంటాం. ఏం ఎస్ ఏం ఈ రంగంలోనూ సోషల్ ఇంజినీరింగ్ మేరకు సహకారం అందుతుందన్నారు. ఇక దాంతో పాటూ భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావాల్సి ఉంది. ఆదాయం పెంచి ప్రజలకు పంచాలన్నదే మా నినాదమన్నారు చంద్రబాబు.  
దీని కోసం విదేశీ పెట్టుబడులకు కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం. కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం అత్యధికం గా 72 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా చర్యలు చేపడతాం.  ఏపి ఏంఎస్ఏంఈ విధానం లో కుటుంబానికి ఒకరు పారిశ్రామిక వేత్త అన్నదే మా లక్ష్యం అని చెప్పారు ఏపీ సీఎం.

Also Read: Stock Market:నష్టాల్లో ముగిసిన సూచీలు..కొనసాగుతున్న డౌన్ ట్రెండ్

2047 స్వర్ణాంధ్ర విజన్.. 

నవంబరు మొదటి వారంలో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌  విడుదల చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీని మానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మారుస్తాం. ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్‌ వచ్చేలా మన ఉత్పత్తులను గ్లోబల్‌ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతాం. గ్రీన్‌ ఎనర్జీ, నదుల అనుసంధానం, పోర్టులను కూడా అనుసంధానం చేస్తాం. దీని కోసం 40 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు.. రూ.30లక్షల కోట్ల పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఉత్పత్తి వ్యయం తగ్గేలా చర్యలు ఉంటాయి.

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు