రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదాలకు ముఖ్య కారణాలు. వీటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా ప్రమాదాలు తగ్గిన దాఖళాలు కనిపించడమే లేదు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రమాదంలో మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు
ఇద్దరు విద్యార్థులు మృతి
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట కొత్తబోయినపల్లి రహదారిపై భారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఇద్దరు విద్యార్థులు స్కూటర్‌పై వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో పులివెందులకు చెందిన బన్నీ, కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కిరణ్ మృతి చెందారు.
అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అక్కడి స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరో మరణం
ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట దళితవాడకు చెందిన గంగాధరం (39)కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడు సునీత అనే ఓ మహిళ ఇంటి గదిని అద్దెకు తీసుకుని కిరాణా షాప్ నడిపాడు. ఆ షాపు మీద వచ్చిన డబ్బులతోనే భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. షాప్ పెట్టి రెండు మూడు వారాలే అయింది. వ్యాపారం బాగా జరుగింది. డబ్బులు బాగా వస్తున్నాయి.
Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...
దీంతో తనతో పాటు తన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. కానీ ఈ లోపు గంగాధరానికి ఊహించని సంఘటన ఎదురైంది. వ్యాపారం బాగా జరగడంతో తానే దుకాణాన్ని నిర్మించుకోవాలని ఇంటి యజమాని సునీత భావించింది. దీంతో గదిని ఖాళీ చేయమని గంగాధరాన్ని కొరింది. అయితే దుకాణం ఏర్పాటు చేసి నెల కూడా కాలేదని.. తనకు మూడు నెలల సమయం ఇవ్వాలని.. అప్పుడే ఖాళీచేయగలనని గంగాధరం పేర్కొన్నాడు.
సునీత చెప్పినా గంగాధరం పెడచెవిన పెట్టడంతో, సునీత అక్క కొడుకు చక్రి తన స్నేహితులతో కలిసి గంగాధరాన్ని బెదిరించి దాడి చేసారు. అయినా గంగాధరం వారికి సర్ది చెబుతూ సమయం కావాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఇంటి యజమాని సునీత పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు గాజ మన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దళిత వాడకు వెళ్లి ఎస్సై పిలుస్తున్నాడంటూ గంగాధరాన్ని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.
Also Read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు
ఆపై పోలీస్ స్టేషన్లో గంగాధరాన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో గంగాధరానికి చెవి, నోట్లో నుంచి రక్తం రావడంతో అతడ్ని గ్రామంలో విడిచిపెట్టారు. ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక, గ్రామంలో జరిగిన అవమానానికి గంగాధరం తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గుర్తించిన గంగాధరం కుటుంబ సభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గంగాధరం మృతిచెందాడు. పోలీసులు కొట్టిన దెబ్బలవల్లే తన కొడుకు మృతి చెందాడని తల్లి ఆవేదన చెందుతుంది.