Crime News : విశాఖలో దారుణం...బర్త్‌ డే పార్టీలో యువతి అనుమానస్పద మృతి

విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని జోడుగుళ్ల పాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

New Update
FotoJet (73)

Suspicious death of a young woman at a birthday party

Crime News : విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది.మృతురాలిని జోడుగుళ్ల పాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు.రాత్రి బర్త్‌డే పార్టీకి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లింది జెస్సీ.తెల్లవారుజామున జెస్సీని మెడికవర్ హాస్పిటల్‌లో చేర్పించామని...ఆమె స్నేహితులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. కుటుంబసభ్యులు వెళ్లేసరికి శాంతి విగత జీవిగా పడి ఉంది. 

అయితే రాత్రి బర్త్ డే పార్టీలో వివాదమే జెస్సీ మృతికి కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆమెను వారే కొట్టి చంపేశారని జెస్సీకా ఫ్యామిలీ ఆరోపిస్తుంది. ఈ మేరకు విశాఖ ఆరిలోవ PSలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె స్నేహితుల వాదన మరో రకంగా ఉంది. ఆమెకు రాత్రి -- ఫిట్స్‌ రావడం వల్లే  చనిపోయిందని స్నేహితులు అంటున్నారు. అయితే జెస్సికా శరీరంపై గాయాలు, చెంపపై దెబ్బలు, గొంతుపై కమిలిన లక్షణాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.ఆరుగురు స్నేహితులతో వెళ్లిన జెస్సీకను వారే హోటల్ గదిలో కొట్టారని జెస్సీ కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. దీంతో  ఆరుగురు  యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు