/rtv/media/media_files/2025/01/30/1WfNdvC5hlK8ZwZlczVI.jpg)
Rana Daggubati:
Actor Rana Daggubati: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కుటుంబంగా వెలుగొందుతున్న ఉన్న దగ్గుబాటి కుటుంబంలో విషాదం నెలకొంది. తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరిదేవి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.కాగా రాజేశ్వరి దేవి అంత్యక్రియలు సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించారు.ఆమె అంత్యక్రియలకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ , కుమారుడు రానా హాజరు అయ్యారు. రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుబాటి సురేష్ ఆమెకు అల్లుడు. ఈ మేరకు అంతిమయాత్రలో పాల్గొని అమ్మమ్మ పాడె మోశారు రానా.
Also Read : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
కాగా అమ్మమ్మ పాడె మోసిన రానా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజెన్స్, అభిమానులు సెలబ్రిటీలు అయినా సరే బంధాలకు, బంధుత్వాలకు తల వంచాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
దగ్గుబాటి రానా విలక్షణ నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.నటుడు గానే కాదు నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా కూడా తన సత్తా చాటుతున్నారు.‘లీడర్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన రానా తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. రానా సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి సమన్వయకర్తగా దాదాపు 70 సినిమాలకు పనిచేశాడు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో భల్లాల దేవ గా పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన 2022లో ‘విరాటపర్వం’ లో నటించారు. అలాగే మరికోన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Maha Kumbh mela: వీవీఐపీల పాస్ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!