/rtv/media/media_files/2025/01/21/rYaKtRs1AFKLpsODNM6R.jpg)
Nandamuri Balakrishna
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు తన సొంత నియోజకవర్గం హిందూపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడు వెంకటస్వామి మరణించగా వారి ఇంటికి వెళ్లారు బాలకృష్ణ. వెంకటస్వామి కుటుంబానికి నివాళులు అర్పిస్తూ భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ రోజు ఉదయం హిందూపూర్ లో ఆధునికరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని సైతం బాలకృష్ణ ప్రారంభించారు.
ఇటీవల మరణించిన కార్యకర్త కుటుంబ సభ్యులను చూసి.. కంటతడి పెట్టిన బాలకృష్ణ..
— greatandhra (@greatandhranews) January 21, 2025
ఇటీవల మరణించిన టీడీపీ నాయకుడు వెంకట స్వామి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. భరోసా ఇచ్చిన బాలకృష్ణ.#Balakrishna #Hindupur pic.twitter.com/HgKVkNsHtM
చాలా రోజులుగా డాకు మహారాజ్ తో బిజీ..
చాలా రోజులుగా డాకు మహరాజ్ సినిమా చిత్రీకరణ, రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సంబరాలు సైతం జరుపుకున్నారు. ఈ సినిమా హడావుడి ముగియడంతో బాలయ్య ప్రస్తుతం హిందూపూర్ లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండా-2 సినిమాలో బాలకృష్ణ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల మహాకుంభమేళాలో నిర్వహించారు. నిజమైన అఘోరాలతో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. మరికొన్ని రోజుల్లో బాలకృష్ణతో షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. బాలయ్యతో వరుస హిట్లు ఇస్తున్న తమన్ ఈ సినిమాకు కూడా సంగీత సారథ్యం వహించనున్నారు.