Chinta Mohan : కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవినే : చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 15 నుంచి 45ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ స్త్రీ, పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు ఫ్రీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. జనవరి 17 నుంచి 30రోజులపాటు ఈ ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు.
కాపు, బలిజ వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని మాజీ టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి నేత ఓ.వి.రమణ మండిపడ్డారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో బలిజలను రాజకీయంగా పాతాళానికి తొక్కారన్నారు. కాపు, బలిజలపై సీఎం జగన్ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
తిరుమలలో డ్రోన్ కెమెరా తిరగడం కలకలం రేపింది. మోకళ్ల పర్వతంపై అస్సాంకు చెందిన కొందరు ఈ డ్రోన్ విజువల్స్ తీశారు. నడకమార్గం, ఘాట్ రోడ్డు అలాగే తిరుమల కొండను షూట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తిరుమలలో డ్రోన్స్ ఎగరవేయడం నిషేధం.
ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
టీటీడీలోని డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. డిగ్రీ/ జూనియర్ లెక్చరర్ల పోస్టులు 78. ఇందులో డిగ్రీ లెక్చరర్ లు 49 , జూనియర్ లెక్చరర్లు 29 ఉన్నాయి
సంక్రాతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఈ రైళ్ల సర్వీసులు అందించనుంది.