/rtv/media/media_files/2025/03/09/4F60j9ZXKUMPthxhaWUg.webp)
Arasavilli temple
Arasavilli temple: సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి మారే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది 9, 10 తేదీల్లో తెల్లవారుజామున భానుడి కిరణాలు అరసవల్లి ఆలయంలోని మూల విరాట్టును తాకడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఆ అవకాశం ఉందని ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. ఆదివారం కావడం, అదే రోజు సూర్యకిరణాలు తాకనుండటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు.
Also Read: Peanuts Peel: పల్లీల పొట్టుతో కూడా పుట్టెడు లాభాలు.. ఏంటంటే?
మబ్బులు, పొగమంచు కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ప్రతీ ఏటా ఉత్తరాయణం మార్చి 9,10 తేదీలలోను దక్షిణాయణం అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. మరి సోమవారం అయినా భక్తులకు ఆ అదృష్టం దక్కుతుందో లేదో చూడాలి.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
సమస్త లోకాలకు వెలుగును ప్రసరింపజేసే సూర్యదేవాలయం కలింగ నిర్మాణ సైలిలో నిర్మించబడింది.ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ రాజు నిర్మించాడు. ఈ అద్భుతమైన కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. సూర్యకిరణాలు నెలల్లో రెండుసార్లు దేవుని పాదాలపై పడే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్య భగవానుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజులుతున్న సూర్య భగవంతుడు బ్రహ్మ విష్ణు స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. సూర్యుని ఆరోగ్య ప్రదాతగా ప్రజలు కొలుస్తారు. అటువంటి సూర్యుని ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది.
ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
సూర్యోదయం సూర్యుని కిరణాలు దేవస్థానం ప్రాంగణంలోని అని వెట్టి మండపం సుదర్శన ద్వారా మధ్యలో నుండి సూర్యుని తొల కిరణాలు గర్భగుడిలోని మూలవిరాటును తాకి గొప్ప తేజస్సును ప్రజ్వలింప చేస్తాయి ప్రతి సంవత్సరం మార్చి 9,10, 11 ,12 అక్టోబర్ 1, 2 ,3 తేదీలలో ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది ఈ అపురూపమైన దృశ్యం తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.ఈరోజు కోసం సూర్యదేవుని భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి విశేషమైన పర్వతనం ఈ రథసప్తమి.సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి పర్వదినాన్ని జరుపుతారు.
Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?