/rtv/media/media_files/2025/02/08/LCV8XqEjsJuNbAgpDR95.webp)
The Snake
The snake bit the woman : పాము కాటేస్తే మనుషులు చనిపోవడం సహజం. కానీ విజయనగరం జిల్లాలో మనిషిని కాటేసిన పాము మృతి చెందటం సంచలనంగా మారింది. దీంతో పాముకంటే మనిషికే విషం ఎక్కువుందని అందరూ కామెంట్ చేస్తున్నారు.విజయనగరం జిల్లా ఎల్‌కోట మండలం లింగంపేటలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read : స్థానిక ఎన్నికలకు సై....ప్రభుత్వానికి కలిసొచ్చేనా?
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేటకు చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళ శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం ఇంటికి సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఓ పాము ఆమెను కాటువేసింది. దీంతో భయంతో సత్యవతి పెద్దగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. పాము కాటేసిన విషయం వారికి చెప్పడంతో హుటాహుటిన సత్యవతిని ఎల్ కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం ఎస్ కోట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతానికి సత్యవతి కోలుకుంటుంది. సత్యవతిని ఎలాంటి ప్రాణాపాయం లేదని త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Results: 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలుపు.. ప్రధాన కారణాలు ఇవే !
ఇదిలా ఉండగా ఆ రాత్రి సమయంలో ఎవరూ గమనించకపోవడం వల్ల కాటేసిన పాము ఏ జాతికి చెందిందనే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే మరునాడు సత్యవతి భర్త సన్యాసయ్యతో కలిసి మరికొందరు స్థానికులు పాము కాటేసిన ప్రాతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడకి వెళ్లిన వారికి వింత అనుభవం ఎదురైంది. సత్యవతిని కాటేసిన పాము అక్కడే చనిపోయి కనిపించింది. దీంతో అవాక్కైన సత్యవతి భర్త పాము మృతి చెందిన విషయాన్ని డాక్టర్లకు తెలియజేశాడు. అయితే మనిషిని కరిచి పాము చనిపోయే పరిస్థితి ఉండదని తెలిపారు వైద్యులు. బహుశా ఆ పాము అప్పటికే అనారోగ్యంతో ఉండి ఉంటుందని, కాటేసిన కంగారులో సత్యవతి పామును తొక్కడం వల్ల ఏమైనా పాము చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అసలు సత్యవతిని కాటేసిన పాము కూడా అది కాకపోవచ్చని, మరో పాము అక్కడ చనిపోవచ్చు అని వారు తెలిపారు. కానీ గ్రామస్తులు మాత్రం సత్యవతిని కరవడం వల్లే పాము చనిపోయిందని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ ఆసక్తికర ఘటన జిల్లాలో వైరల్‌గా మారడంతో హాట్ టాపిక్ అయింది.
Also Read : ప్రచారంలో ఆ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. ఇంతకీ అతను గెలిచాడా.. ఓడాడా?
Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..