/rtv/media/media_files/2025/03/22/LkBde3Pjupo8EK5qvbN7.jpg)
Kandula Narayana Reddy
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన ఓ చేతికి సైలైన్ పెట్టుకుని.. మరో చేస్తో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అక్కడి నుంచే అధికారులకు వినతుల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
చేతికి సెలైన్ బాటిల్ తోనే ప్రజాదర్బార్ ... మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి 🔥 pic.twitter.com/xDusR5cspD
— Manchodu Mani (@manchodumani) March 22, 2025
ఎమ్మెల్యేపై ప్రశంసలు..
శనివారం రోజు ప్రజాదర్బార్ ఉంటుందని మూడు రోజుల క్రితమే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని భావించిన ఎమ్మెల్యే అలానే కొనసాగించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆ కార్యక్రమం కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
(viral-video | telugu-news | latest-telugu-news)