Nara Lokesh: పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటా.. డిప్యూటీ సీఎం నాకొద్దు.. లోకేష్ సంచలన కామెంట్స్!

టీడీపీ కీలక నేత, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుండి తప్పుకుంటానన్నారు. ఒక్కరికి ఒకే పదవి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ అవకాశాలు రావాలన్నారు. డిప్యూటీ సీఎం పదవి ఆలోచన లేదన్నారు.

New Update
Nara Lokesh

టీడీపీ కీలక నేత, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుండి తప్పుకుంటానన్నారు. ఒక్కరికి ఒకే పదవి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానన్నారు. అందరికీ అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పదవిపై కూడా రియాక్ట్ అయ్యారు. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. మంత్రిగానే కొనసాగుతానన్నారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఇటీవల పలువురు టీడీపీ నేతలు హైకమాండ్ ను కోరుతూ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Vijayasai Reddy: విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్!

జనసేన నేతలు సైతం ఈ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అలా అయితే చంద్రబాబును కేంద్ర మంత్రిని చేసి పవన్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ కావడంతో ఇరు పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగాయి. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 
ఇది కూడ చదవండి: YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?

#nara-lokesh #latest-telugu-news #telugu breaking news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు